రాజ్యసభ స్థానాలకు వైయ‌స్ఆర్ సీపీ అభ్యర్థుల‌ నామినేషన్లు

By udayam on May 25th / 7:10 am IST

రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న నాలుగు రాజ్యసభ స్థానాలకు వైయ‌స్ఆర్ సీపీ అభ్యర్థులు విజయసాయి రెడ్డి, ఆర్​.కృష్ణయ్య, నిరంజన్​రెడ్డి, బీద మస్తాన్​లు బుధవారం నామినేషన్లు దాఖలు చేశారు. ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి అయిన రాష్ట్ర శాసన మండలి ఉప కార్యదర్శి పీవీ సుబ్బారెడ్డికి నామినేషన్‌ పత్రాలను అందజేశారు. ఏపీలో ఖాళీ కానున్న ఈ నాలుగు స్థానాల్లో ఎన్నికల నిర్వహణకు మంగళవారం రిటర్నింగ్‌ అధికారి పీవీ సుబ్బారెడ్డి నోటిఫికేషన్‌ను జారీచేశారు. వీరి ఎన్నిక ఏకగ్రీవం కానుంది!

ట్యాగ్స్​