అనంతబాబును సస్పెండ్​ చేసిన వైకాపా

By udayam on May 26th / 3:38 am IST

ఆంధ్రప్రదేశ్​ అధికార పార్టీ వైకాపా.. తన డ్రైవర్​ను హత్య చేసిన కేసులో నిందితుడుగా ఉన్న సొంత ఎమ్మెల్సీ అనంత బాబును పార్టీ నుంచి సస్పెండ్​ చేసింది. డ్రైవర్​ను తానే చంపినట్లు ఎమ్మెల్సీ ఒప్పుకోవడంతో పార్టీ అతడిని సస్పెండ్​ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ హత్య కేసు కాకినాడలో తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రతిపక్షాలు, ప్రజలు సైతం అనంతబాబును అరెస్ట్​ చేయాలంటూ ఉద్యమించారు. దీంతో ఎమ్మెల్సీ సోమవారం ఉదయం పోలీసుల ఎదుట లొంగిపోయారు.

 

ట్యాగ్స్​