వచ్చే ఎన్నికల్లో వైకాపాకు 175 స్థానాల్లోనూ గుండు సున్నా తప్పదని తెదేపా అధినేత చంద్రబాబు జోస్యం చెప్పారు. ఆఖరికి సీఎం జగన్ సొంత నియోజకవర్గం పులివెందులోనూ ఓటమి తప్పదన్నారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో ఆక్వా రైతులతో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడని స్పందన ఇటీవల కర్నూలు పర్యటనలో చూశానని చంద్రబాబు చెప్పారు. పెద్ద ఎత్తున యువత, ప్రజలు తరలివచ్చారన్నారు. అందుకే వైకాపాలో ప్రకంపనలు ప్రారంభమయ్యాయని.. 8 మంది జిల్లాల అధ్యక్షుల్ని మార్చేశారని చెప్పారు.