మైదానంలో తోసుకున్న క్రికెటర్లు

By udayam on October 4th / 6:14 am IST

లెజెండ్స్​ లీగ్​ పోటీల్లో సీనియర్​ క్రికెటర్లు గొడవపడ్డారు. ఆదివారం జరిగిన బిల్వారా కింగ్స్​, ఇండియా క్యాపిటల్స్​ మ్యాచ్​లో భారత క్రికెటర్​ యూసఫ్​ పఠాన్​, ఆస్ట్రేలియా పేసర్​ మిచెల్​ జాన్సన్​లు ఒకరిపై ఒకరు కొట్టుకునే వరకూ వెళ్ళారు. ఈ క్రమంలో ఒకరినొకరు తోసుకోవడంతో అంపైర్లు, సహచర ప్లేయర్లు కలుగజేసుకుని వీరిద్దరినీ విడదీశారు. జాన్సన్​ బౌలింగ్​లో పఠాన్​ బౌండరీలు బాదడమే ఈ గొడవకు కారణమని తెలుస్తోంది.