ఖార్కియెవ్ వద్ద రష్యా సైన్యాన్ని సరిహద్దుల వరకూ తరిమికొట్టామని ఉక్రెయిన్ అధ్యక్షుడు ఒలొదిమిర్ జెలెన్ స్కీ ప్రకటించారు. ఈ మేరకు ఆ దేశ రక్షణ శాఖ ఓ వీడియోను విడుదల చేసింది. ఇందులో ఉక్రెయిన్ సైన్యం రష్యా సరిహద్దుల వద్దకు చేరుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ‘మేం మా సరిహద్దులను తిరిగి పునరుద్ధరించాం’ అని ఖార్కియేవ్ గవర్నర్ ఒలేహ్ సినెగుబోన్ ప్రకటించారు. మరో వైపు డాన్బాస్పై రష్యా దాడులను అడ్డుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు స్కీ చెప్పారు.