తమ దేశంలోని 2 లక్షల మంది చిన్నారులను రష్యా సైనికులు ఆ దేశానికి తీసుకుపోయారని ఉక్రెయిన్ అధ్యక్షుడు ఒలొదిమిర్ జెలెన్ స్కీ ఆరోపించారు. బుధవారం రాత్రి వీడియో ప్రకటన విడుదల చేసిన ఆయన ‘బలవంతంగా చిన్నారుల్ని ఉక్రెయిన్ బోర్డర్ దాటిస్తుననారు. వీరిని రష్యాలోని వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారు’ అని పేర్కొన్నారు. బుధవారం రాత్రి ఎల్వివ్ ప్రాంతంలో రష్యా సైనికులు రాకెట్ల దాడి జరిపడంతో 5 గురు పౌరులు గాయపడ్డారని తెలిపారు.