జొమాటోకు గుడ్​బై చెప్పిన గౌరవ్​

By udayam on September 14th / 8:22 am IST

ఫుడ్​ డెలివరీ యాప్​ జొమాటో సహ వ్యవస్తాపకుడు గౌరవ్​ గుప్త ఆ కంపెనీకి గుడ్​ బై చెప్పేశాడు. దాదాపు 6 ఏళ్ళ క్రితం ఈ కంపెనీని ప్రారంభించిన అతడు ఇకపై ఆ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ఉద్యోగులకు పంపిన మెయిల్​లో పేర్కొన్నాడు. ఇటీవలే జొమాటో తన యాప్​ నుంచి గ్రోసరీ డెలివరీలను నిలిపివేయనున్నామని ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతకు ముందు కంపెనీకి సిఓఓగా ఉన్న గౌరవ్​ అనంతరం జొమాటో న్యూట్రిషన్​ విభాగానికి మారాడు. ఇప్పుడు ఆ విభాగం సేవలు 17 నుంచి నిలిచిపోతుండడంతో అతడు రాజీనామా చేశాడు.

ట్యాగ్స్​