17 నుంచి జొమాటోలో నిత్యావసరాల డెలివరీ బంద్​

By udayam on September 13th / 1:11 pm IST

ఈనెల 17 నుంచి తమ యాప్​ ద్వారా నిత్యావసరాల సరఫరాను నిలిపివేస్తున్నట్లు జొమాటో తాజాగా ప్రకటించింది. ఇప్పటికే గ్రోఫర్స్​ యాప్​ను కొనుగోలు చేసిన జొమాటో ఇకపై గ్రోసరీల అమ్మకాలను ఆ యాప్​ ద్వారానే జరపాలని నిర్ణయించింది. దీంతో ఈనెల 17 నుంచి జొమాటో యాప్​ ద్వారా నిత్యావసర వస్తువుల అమ్మకాల్ని నిలిపివేస్తున్నట్లు తెలిపింది. ‘ప్రస్తుతం మా యాప్​ ద్వారా నిత్యావసరాల్ని అమ్మాలన్న మా ఆలోచనను విరమించుకుంటున్నాం’ అని జొమాటో ట్వీట్​ చేసింది.

ట్యాగ్స్​