కాళేశ్వరం భూసేకరణకు హైకోర్ట్​ బ్రేకులు

కాళేశ్వరం ప్రాజెక్టు కోసం మరింత భూసేకరణ చేయాలన్న తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్ట్​ బ్రేకులు వేసింది. ప్రతీ రోజు మరో టిఎంసి నీటిని తరలించేలా ఈ భూసేకరణ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై కరీనంగర్​కు చెందిన చిందం శ్రీహరితో పాటు మరో 4 గురు కోర్టుకెక్కడంతో ఈ ఇంటీరియం ఆర్డర్​ను హైకోర్ట్​ జారీ…

అంబానీ ఇంటికి కడియం మొక్కలు

బిలియనీర్​, రిలయన్స్​ ఇండస్ట్రీస్​ అధినేత ముకేష్​ అంబానీ తన జామ్​నగర్​ ఇంటి కోసం కడియం నుంచి మొక్కలను కొనుగోలు చేశారు. 170, 200 ఏళ్ళ వయసున్న రెండు ఆలివ్​ చెట్లను కడియంలోని గౌతమి నర్సరీ నుంచి ఆర్డర్​ చేసినట్లు…

మరిన్ని వార్తలు..
 • కాళేశ్వరం భూసేకరణకు హైకోర్ట్​ బ్రేకులు

  కాళేశ్వరం ప్రాజెక్టు కోసం మరింత భూసేకరణ చేయాలన్న తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్ట్​ బ్రేకులు వేసింది. ప్రతీ రోజు మరో టిఎంసి నీటిని తరలించేలా ఈ భూసేకరణ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై కరీనంగర్​కు చెందిన చిందం శ్రీహరితో పాటు మరో 4 గురు కోర్టుకెక్కడంతో ఈ ఇంటీరియం ఆర్డర్​ను హైకోర్ట్​ జారీ చేసింది. కేంద్రప్రభుత్వం రోజుకు 2 టిఎంసిల నీటిని తరలించేందుకే అనుమతులు ఇచ్చిందని జస్టిస్​ టి.వినోద్​ కుమార్​ తన ఆదేశాల్లో పేర్కొన్నారు.

 • తెలుగు రాష్ట్రాల్లో పేదరికం ఎంతంటే?

  దేశంలో పేదరికాన్ని కరోనా మహమ్మారి విపరీతంగా పెంచినట్లు నీతి అయోగ్​ నివేదిక బయటపెట్టింది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో 51.91 శాతం పేదలతో బీహార్​ అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత ఉత్తర ప్రదేశ్​లో 37.79, మధ్యప్రదేశ్​లో 36.65 శాతం, మేఘాలయలో 32.67 శాతం ఉంది. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ ఈ జాబితాలో 13.74 శాతంతో 18వ స్థానంలోనూ, 12.31 శాతంతో ఆంధ్రప్రదేశ్​ 20వ స్థానంలోనూ ఉన్నాయి. పేదలు అతి తక్కువుగా రాష్ట్రాల్లో కేరళ (0.71 శాతం), గోవా (3.76 […]

 • సెన్సార్​ పూర్తి చేసుకున్న ఆర్​ఆర్​ఆర్​

  మెగా పాన్​ ఇండియా మూవీ ఆర్​ఆర్​ఆర్​ విడుదలకు సిద్ధమవుతున్న కొద్దీ అప్డేట్స్​ వరుసపెడుతున్నాయి. తాజాగా ఈ సినిమా సెన్సార్​ను పూర్తి చేసుకుందన్న వార్త బయటకొచ్చింది. 3.06 గంటల నిడివి వచ్చిన ఈ సినిమాకు యు/ఎ సర్టిఫికెట్​ వచ్చిందని తెలుస్తోంది. రామ్​చరణ్​, ఎన్టీఆర్​, అజయ్​ దేవ్​గన్​, అలియా భట్​, శ్రీయ, ఒలివియా మోరిస్​లు కలిసి నటిస్తున్న ఈ చిత్రం జనవరి 7న విడుదల కానుంది.

 • విశాఖలో ఇద్దరు ఎమ్మెల్సీలు ఏకగ్రీవం

  ఆంధ్రప్రదేశ్​లో స్థానిక సంస్థల కోటా నుంచి అధికార పార్టీకి చెందిన చెల్లబోయిన శ్రీనివాసరావు, వరుదు కళ్యాణిలకు ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. పోటీలో ఉన్న మిగతా వారంతా తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో వీరి ఎన్నిక ఏకగ్రీవమైనట్లు ఎన్నికల రిటర్నింగ్​ అధికారి జేసీ ఎం.వేణుగోపాలరెడ్డి ప్రకటించారు. వైఎస్సార్​ కాంగ్రెస్​ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఉండడంతో టిడిపి ఈ ఎన్నికలకు దూరంగా ఉంది.